Listen to this article

జనం న్యూస్ :5 మార్చ్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ : సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం లో ఇందిరమ్మ కాలనీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిట్స్ నిర్వహించడం జరిగింది . ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తిలకించి వాటి యొక్క విషయాలను తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్ల గురించి వివరించడం జరిగింది. ప్రతి తల్లిదండ్రులకు కులంకషంగా భావితరాల ఏర్పాట్లు ఈ విధంగా ఉండాలని తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ హరినాథ్ పర్యవేక్షణ చేసి విద్యార్థులకు అభినందనలు తెలియజేశాడు.