


కబడ్డీ ఆడుతుండగా విద్యార్థికి గాయాలయ్యాయి తల్లితండ్రుల కు సమాచారం ఇవ్వని పాఠశాల యాజమాన్యం దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామంలో పాఠశాల బస్సును అడ్డుకొని తల్లిదండ్రుల ఆందోళన. జనం న్యూస్ 5 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విద్యార్థులతో క్రీడలు ఆడించడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామెర గ్రామానికి చెందిన అల్లెపు శ్రీను, పద్మ దంపతుల కుమారుడు అంజి సెయింట్ థామస్ హై స్కూల్ లొ ఏడవ తరగతి చదువుతున్నాడు. ఫిబ్రవరి 12 నాడు పి టి సార్ తిరుపతి విద్యార్థుల కు కబడ్డీ ఆడిస్తూ తను విద్యార్థులను పట్టించుకోకపోవడంతో విద్యార్ధి అంజికి వృషనాలమీద ఇంకో విద్యార్ధి తన్నడంతో బలమైన గాయం అయింది. పి. టి సర్, కాని స్కూల్ యాజమాన్యం విద్యార్ధి తల్లితండ్రులకు విషయం చెప్పలేదు. గాయం అయినా అయిదు రోజులకు నొప్పిబాగా అవడంతో ఇలా జరిగిందని విద్యార్ధి తల్లితండ్రులకు చెప్పడంతో ముల్కనూర్ హాస్పిటల్ కు తీసుకెళ్ళినా తగ్గకపోతే స్కూల్ కెళ్ళి పి. టి సర్ ను అడిగితే అప్పుడు ప్రిన్సిపాల్ కార్తీక్ రావు నిను హాస్పటల్ కు తీసుకెళ్తా అన్ని నినే చూసుకుంటానని చెప్పి హుజురాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తే స్కాన్ చేసి చూసాక బ్లెడ్ గడ్డ కట్టింది. హన్మకొండ కు తీసుకెళ్లామని చెప్పడంతో హన్మకొండ హాస్పిటల్ లొ సర్జరీ చేసి వృషనాన్ని తీసేసారు. హాస్పటల్ నుండి తీసుకచ్చినాక మాట్లాడుదాం అప్పటిదాకా ఎవరికీ చెప్పకు అన్న కార్తీక్ రావు ఇప్పుడు ఏంచేస్కుంటావో చేసుకో అని విద్యార్ధి తల్లి తండ్రులను బెదిరిస్తున్నాడు. బుధవారం రోజునా దామెరా గ్రామంలో పాఠశాల బస్సును ఆపి విద్యార్ధికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు.