

జనం న్యూస్- మార్చి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బంజారా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో బంజారా బిడ్డలను మొత్తం ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర రాములు నాయక్ పోషించారని, కాంగ్రెస్ పార్టీ విజయంలో రాములు నాయక్ కృషి వెలకట్టలేనిదని కొనియాడారు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఒక బంజారా మంత్రి కూడా లేకపోవడం శోచనీయమని, రాబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా సపావత్ రాములు నాయక్ కు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, రాములు నాయక్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో చంద్రమౌళి నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ అధ్యక్షుడు అంగోతు చందులాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి మునావత్ శివ నాయక్, యూత్ అధ్యక్షులు జటావత్ బాలునాయక్, ప్రధాన కార్యదర్శి రామావత్ ఏడుకొండలు, సహాయ కార్యదర్శి జటావత్ నాగు నాయక్, మహిళా అధ్యక్షురాలు కోర్ర వర కుమారి, ప్రధాన కార్యదర్శి రామావత్ జమున, సోనాబాయి, రంగమ్మ, కమలమ్మ, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.