

నందలూరు మండల డీలర్ల సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
జనం న్యూస్ నదులు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో కక్ష్య పూరిత చర్యల వల్ల చౌక దుకాణం డీలర్ల మజాకా, సూర్య పత్రికలో ప్రతినితమైన వార్త పై ప్రభుత్వ చౌక దుకాణం డీలర్ల పాత్రికేయుల సమావేశం, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల అరవ పల్లె చౌక దుకాణం, 3 పై బుధవారం సూర్య పత్రికలో ప్రచురితమైన చౌక దుకాణం డీలర్ల మజాకా, వార్తపై బుధవారం అరవపల్లె చౌక దుకాణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుదీర్ మాట్లాడుతూ ఈ వార్త రాసిన వ్యక్తి ఒక బినామీ ఎం డి యు అధికారులను సైతం బెదిరించి వెహికల్ స్వాధీనం చేసుకొని, రేషన్ పంపిణీ చేసేవాడు, ఇతడి ఆగడాలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇతనిని తొలగించడం జరిగింది, దీంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ వార్తను ప్రచురించారు అంతేకానీ ఎం డి యు వ్యవస్థ మీద మాకు గౌరవం లేక కాదు ఒక పాత్రికేయుడు వ్యవస్థలో జరిగే చెడును ప్రచురించాలే గాని మీడియాను అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు రాయడం ఎంతవరకు సబబు అని ఇలాంటి వారినిమీడియా వారే పక్కన పెట్టాలని ఆయన తెలిపారు అనంతరం నందలూరు మండలం చౌక దుకాణాల అధ్యక్షురాలు షేక్ మహబూబ్ జాన్ మాట్లాడుతూ చౌక దుకాణం డీలర్ల మజాకా అని నేటి సూర్య పత్రికలో ప్రచురించారు అసలు మజాకా అంటే ఏంటో అర్థం కావడం లేదని 2024లో చౌక దుకాణానికి ఎం డి యు కావాలని కలెక్టర్ ని కోరగా నాగరాజు అనే వ్యక్తిని ఎం డి యు గా నియమించారు అతని స్థానంలో బినామీగా వచ్చిన సురేంద్ర బియ్యం సరఫరా చేస్తున్నాడు, బియ్యం సరఫరా చేసేటప్పుడు మిగిలిన బ్లాక్ స్టాక్ ను చూపించకుండా ఇస్తాను రాజ్యాంగ చేసేవాడిని, ఇతను చేష్టలు భరించలేక ఆర్డిఓ ని సంప్రదించగా అతనిని ఎం డి యు గా తొలగించారు, అలా వ్యక్తిగత కక్షలను దృష్టిలో ఉంచుకొని మీడియాను అడ్డుపెట్టుకొని ఇలా వ్రాయడం సబబు కాదని ఆమె తెలిపారు గత రెండు నెలలుగా రేషన్ పంపిణీ చేయలేదని ప్రచురించారు,రేషన్ పరిధిలో ఉన్న ప్రజలు రేషన్ పంపిణీ చేయకుండా ఉంటే ప్రజలు ఊరుకుంటారా, ఇంటర్నెట్, ఆన్లైన్ తదితర సౌకర్యాలు ఉన్నటువంటి ప్రస్తుత జనరేషన్లో పంపిణీ చేశామో లేదో అధికారులకు తెలియదా అని ఆమె తెలిపారు, అంతేకాక, ఆమె చెప్పిందే వేదం అనే ప్రచురణ నేను ఏమైనా ఎంఎల్ఏ నా లేక ఎం.పి నా అని వాపోయారు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు, ఈ సమావేశంలో మండల డీలర్ల అధ్యక్షురాలు షేక్ మహబూబ్ జాన్, వైస్ ప్రెసిడెంట్ పాటూరు డీలర్ ఈ, సుభాషిని, నందలూరు డీలర్ మురళి, నాగిరెడ్డిపల్లె డీలర్ ఉమా మహేష్, కుమ్మరి పల్లె డీలర్ నరసింహులు పాల్గొన్నారు,