Listen to this article

ప్రభుత్వం వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఫలమైన ప్రభుత్వం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- ప్రభుత్వం వెంటనే రైతులకు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీరు విడుదల చెయ్యాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకపక్క మూడు పర్యాయాలుగా రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎస్సారెస్పీ కాలువలో నీరు ఉన్న వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, వేల రూపాయలు వెచ్చించి వేసిన పంటలు పొట్ట దశకు వచ్చేసరికి నీరు లేక ఎండిపోతున్నాయి అన్నారు. ఎకరాకు 30000 ఖర్చు చేసి వేసిన పంటలకు నీరు లేక ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతులతో ఉద్యమిస్తామన్నారు.