Listen to this article

జుక్కల్ మార్చ్ 5, జనం న్యూస్ కామారెడ్డి జిల్లా నియోజకవర్గం మద్నూర్ జాతీయ రహదారిపై ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం మద్నూర్, ఆర్టీవో, రెవిన్యూ, పోలీస్ అధికారులు బృందంగా ప్రమాదం జరిగే స్థలాలను పరిశీలించారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాదాలు నివారించవచ్చో నని ఒక అంచనాకు వచ్చారు. జాతీయ రహదారిపై ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టీవో రజిని, బిచ్కుంద సీఐ నరేష్, మద్నూర్ ఆర్టీవో అధికారి సుభాష్, మద్నూర్ ఎమ్మార్వో ముజీబ్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, ఎన్ హెచ్ ఏ పెట్రోలింగ్ టీం పాల్గొన్నారు.