

జనం న్యూస్ మార్చి 5 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని కేపీ గూడెం గ్రామంలో బుధవారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ అధ్యక్షతన కోడిపుంజుల గూడెం యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నాగిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పగిళ్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, కోడిపుంజుల గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ నాగేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి గురులింగం, పల్లపు గోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..