Listen to this article

జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీసీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. తాడువాయి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లొడంగి వెంకయ్య, భీమ్ల తదితరులు పాల్గొన్నారు.