Listen to this article

•నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు

రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా

సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్

జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- రఘు మృతి తీరని లోటు అని సొంత తమ్ముడిని కోల్పోయానని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు. బుధవారం రఘు దశదినకర్మలో పాల్గొని రఘు చిత్రపటానికి ఎలక్ట్రానిక్@ ప్రింట్ మీడియా సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులను ఓదార్చరు.రఘు కుటుంబానికి జర్నలిస్టులు అందరం అండగా ఉంటారని హామీ ఇచ్చారు.అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించే మనిషి కనిపించకపోవడం నిజంగా మనస్సును కలిచి వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట టి యు డబ్ల్యూ జే హెచ్,143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్, కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్@ప్రింట్ మీడియా సభ్యులు ఉన్నారు.