జనం న్యూస్ మార్చి 5 నడిగూడెం అంగన్వాడి భవన నిర్మాణ పనులలో నాణ్యత పాటించడంలో రాజీ పడద్దని పంచాయతీరాజ్ డిఈ ఆర్. హర్ష అన్నారు. ఎంఎన్ఆర్ఇజిఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో నడిగూడెంలో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. వారి వెంట నడిగూడెం మండల పంచాయతీరాజ్ ఏఈ లావణ్య ఉన్నారు.