Listen to this article

జనం న్యూస్- మార్చి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎన్నికల సమయంలో నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 1 వ వార్డు విజయ్ విహార్ పక్కన ఉన్న రోడ్డు కు నిధులు విడుదల చేశారు, ఈరోజు ఈ సీసీ రోడ్డు పనులకు నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉంగరాల శ్రీనివాస్, పగడాల నాగరాజు, నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఉపేందర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్డు నిర్మిస్తున్నందుకు గాను కాలనీ ప్రజల తరపున నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు, నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుంటారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కుందూరు బ్రదర్స్ ఎప్పుడు ముందుంటారని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉంగరాల శ్రీనివాస్, పగడాల నాగరాజు, నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.