Listen to this article

జనం న్యూస్ జనవరి 11 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ
గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. శనివారం పెనుగొండ గ్రామపంచాయతీ పార్కు వద్ద జరిగిన శానిటరీ వర్కర్స్ సమావేశంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, రోజుకు నాలుగు సార్లు టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉన్నత పాఠశాలలో 300 విద్యార్థులకు ఇద్దరు ఆయాలు పనిచేస్తున్నారని, 300 మంది విద్యార్థులో ఒక విద్యార్థి తక్కువై 299 ఉంటే రెండవ ఆయాను దేవ, వడలి పాఠశాలల్లో తొలగించారని విమర్శించారు. ఉన్నత పాఠశాలలో 20 నుంచి 30 వరకు టాయిలెట్స్ ఉంటాయని ఒక ఆయా వాటిని శుభ్రం చేయడం సాధ్యం కానిది, కనుక 50 నుండి 200 వరకు విద్యార్థులు ఉంటే ముగ్గురిని పనిలో ఉంచాలని డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని, కోరారు. స్కూళ్లలో ఆయాలచే పారిశుద్ధ్య పనులే కాక ఇతర పనులు కూడా చేయిస్తున్నందున వారికి పని భారం పెరుగుతున్నదని, ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూలులోనే ఉండాలని టీచర్లు ఆయాలపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ వర్కర్స్ పనిని సమీక్షించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు షేక్ పాదుషా, సిఐటియు నాయకులు మాదాసు నాగేశ్వరరావు ఉటాల కుమారి, వెన్నపు సుధారాణి, వమ్ము అరుణ, టి దుర్గ, బి .ఎం తాయారు తదితరులు పాల్గొన్నారు.