Listen to this article

జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలని ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెజార్టీ ప్రజలు గా ఉన్న వెనక బడిన వర్గాలు అంటే బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇప్పటికీ వెనకబడే ఉన్నారన్న సంగతి గమనించాలన్నారు. విజయనగరం ఎస్ కన్వెన్స్ టిఎస్ఆర్ గ్రాండ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, 54 శాతం ఓటు బ్యాంకు కలిగిన వెనకబడిన తరగతుల ప్రజలు తాము ఎన్నుకుంటున్న రాజకీయ పార్టీల ద్వారా సామాజిక న్యాయం పాటించకపోవడం వల్ల నేటి పరిస్థితి కొనసాగుతూ వస్తుందని విచారం వ్యక్తం చేశారు. కనీస ప్రాథమిక హక్కులు కూడా పొందలేని స్థితిలో బిసీ వర్గాలు ఇంకా ఉన్నాయంటే పాలకులు సిగ్గుపడాల్సి ఉందన్నారు. కనీస విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు సమాన స్థాయిలో అందడం లేదన్నది అందరికీ తెలిసిందేనన్నారు. అందుకే ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ బీసీ వర్గాలను రాజకీయ చైతన్యం వైపు మళ్లించాలని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు విజయనగరం రావడం జరిగింది. కులాలుగా, కుల సంఘాలుగా బీసీలు విడిపోతున్నారని అందరూ ఒకే త్రాటి మీదకి వచ్చి బీసీ వేదికపై వచ్చి తమ ఉమ్మడి గళం వినిపించాలన్నదే ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈరోజు కులవృత్తుల స్థానంలో కార్పొరేట్ సంస్థలు తమ వస్తువులను ప్రవేశ పెట్టడం వల్ల బీసీ వర్గాల ఉపాధి పడిపోయిందని వాపోయారు. ప్రత్యామ్నాయంగా పాలకులు నేటికీ బీసీలకు ఏ విధమైన సహాయము అందించకపోవడం విచారకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తమ సంఘం ఉద్యమిస్తున్నదని తెలియజేశారు. సమగ్ర కుల గణన జరగకుండా బీసీలకు న్యాయం జరగదని ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా బిసి జాతీయ నాయకురాలు దొమ్మేటి శిరీష మాట్లాడుతూ, త్వరలోనే పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదించబడుతుందన్న ఆశా భావం వ్యక్తం చేస్తూ, మహిళలు రాజ్యాధికారం లో వాటా సాధించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని మహిళలు కూడా గుర్తించాలని కోరారు. విజయనగరం జిల్లా ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా తాడ్డి శ్రీనివాసరావు నాయుడు. విజయనగరం జిల్లా ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా, ప్రముఖ సంఘ సేవకులు, పారిశ్రామిక వేత్త తాడ్డి శ్రీనివాసరావు నాయుడు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు నియమిస్తున్నట్లు గూడూరు వేంకటేశ్వర రావు తెలియజేశారు. ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ మండల స్థాయి గ్రామ స్థాయి వరకు వారి ద్వారా కమిటీలు నియామకం చేసి సంఘాన్ని బలోపేతం చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాడ్డి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ, బీసీల సమస్యల పట్ల పూర్త అవగాహన ఉన్న గూడూరి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో విజయనగరం జిల్లాలో గ్రామస్థాయి వరకు బీసీలను చైతన్యం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సందర్బంగా పి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ నేతలుగా పలువురిని నియామకాలు చేశారు. వారిలో జిల్లా ఉపాధ్యక్షులుగా ముల్లు పైడి నాయుడు, మరో ఉపాధ్యక్షుడిగా వల్లూరి గౌరీ నాయుడు, ఉపాధ్యక్షురాలుగా సిహెచ్ చంద్రిక చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా పొట్నూరు నారాయణరావు లను నియమించారు.