Listen to this article

జనం న్యూస్ మార్చి 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లీ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణమునందు నూతనంగా శ్రీ కాశీ విశ్వనాథ సహిత అన్నపూర్ణేశ్వరి దేవాలయ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ఈరోజు వి.ఎన్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు యామిని దంపతుల కరకమలములచే భూమి పూజ కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు, ఆ పరమశివుని కృపతో ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తి కావాలని వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు శ్రీ కాశీ విశ్వనాథ మరియు అన్నపూర్ణేశ్వరి దేవతల దర్శన భాగ్యం భక్తులకు కలగాలని మనస్పూర్తిగా శివపార్వతులను వేడుకొని దృడ సంకల్పం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అయినేని సుదర్శన్ రావు నాయినేని సూర్యారావు కుర్మయ్యగారి సుదర్శన్ రావు వడ్డేపల్లి భూపతి రావు వడ్డేపల్లి మురళీధర్ రావు గొట్టిముక్కుల భాస్కర్ రావు భగవాన్ కిషోర్ కాలనీవాసులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.