Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆంధ్ర రాష్ట్ర అభివృదికి దిక్సుచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేనపార్టీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య అన్నారు. బుధవారం చిలకలూరిపేట పట్టణములోని గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందునియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశములో రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14వ తేదీ పీఠాపురంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని ఆయన అన్నారు. ఒక నీతివంతమైన నాయకుని పార్టీలో మీ అందరితో పాటు నేను ఉండటం చాలా సంతోషంగా ఉందని రోశయ్య అన్నారు.పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరూ మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికీ ఓట్లు వేసి అఖండమైన విజయం అందించారని అన్నారు. అనంతరం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ మాట్లాడుతూ పేట నియోజకవర్గము నుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి పిఠాపురం లో జరిగే సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు జనసేనపార్టీ కి ఇచ్చిన మద్దతు, విజయం గురుంచి పార్టీ అధినేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేనపార్టీ ఏ విధముగా కార్యాచరణ రూపొందిస్తుందో ఆయన తెలియజేయడం జరుగుతుందని రాజారమేష్ అన్నారు. అనంతరం పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ దుశ్శాలువతో, పూలమలతో రోశయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాకనాటి రమాదేవి,నిశంకర శ్రీనివాస్, బాలాజీ, షేక్ సుభాని, మునీర్ హసన్, భాషా, శరత్, రామారావు, బ్రహ్మస్వాములు, రవితేజ, శివశంకర్, లీలా కిషోర్, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.