Listen to this article

జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: పాడి పరిశ్రమాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మండలం రేగులపాడు గ్రామంలో రూ.2లక్షల 30వేల రూపాయిల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన మిని గోకులం (గోశాల)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లు, ఉద్యాన పంటల పెంపకం, రైతులకు నేరుగా చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించలేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. మినీ గోకులాల (గోశాల) ను రాష్ట్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలొ భారీ ఎత్తున ప్రారంభించడం జరిగిందని, 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయక పొగా పాతవాటికి బిల్లులు చెల్లించలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని అన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల ధ్వంసమైన రోడ్ల నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని ప్రతీ గ్రామంలో పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ఉద్యాన పంటలు అధిక దిగుబడులు ఇస్తాయని రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పారు. లింగాలపాడుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేసి పంటలకు నీరు అందించేందుకు కృషి చేశామన్నారు. దేశంలోనే మరెక్కడలేని విధంగా రూ. 4వేలు పించను అమలు చేసిన ఘనత ఆంద్రప్రదేశంలో కుటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహాణ బాద్యతలు ప్రైవేటు యాజమాన్యాలకు జరుగుతుందని తద్వారా ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందని, ఇది ఒక శుభపరిణయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె వి మహేశ్వర రెడ్డి, పిఎసిఎస్‌ మాజీ సభ్యులు కింజరాపు హరి వర ప్రసాద్‌, పశు సంవర్ధక సంయుక్త సంచాలకులు మురళీధర్‌, రేగులపాడు గ్రామ సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎమ్‌.పి.డి.ఓ ఫణింద్ర రావు, ఎపిఓ హరి ప్రసాద్‌, మండల నాయకులు తర్ర రామక్రిష్ణ, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, ఎన్‌, శ్రీనివాసరావు, పల్లి రాంబాబు, పల్లి శ్రీధర్‌, అడిషనల్‌ ఎస్పీ రామారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.