Listen to this article

జనం న్యూస్, మార్చి 07 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ ల నందు ఏ ట్రేడ్ లో అయిన ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్థులకు తేదీ. 10.03.2025, సోమవారం రోజున ఉదయం 09.30 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ. నందు ప్రధానమంత్రి నేషనల్ అప్ప్రెంటీస్షిప్ మేళా నిర్వహించ నున్నట్లు పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపల్/కన్వీనర్ బుసిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి మేళాకు తోషిబా , ఎల్ & టి , జాన్సన్ లిఫ్ట్స్ ఇండియా ,టాటా ఏరోస్పేస్, వరుణ్ మోటార్స్, ఆదర్శ మోటార్స్. రాణే ఇంజిన్ వాల్వ్ ,ఐ. టీ. సి. టెక్నాలజీస్ హైదరాబాద్ మరియు కరీంనగర్ నుoడి వివిధ కంపెనీలు వస్తున్నాయి . ఆసక్తి గల అభ్యర్థులు అప్ప్రెంటీస్షిప్ వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in/ నందు రిజిస్టర్ చేసుకుని సరియైన ధృవ పత్రాలతో (ఎస్ ఎస్ సి , ఐ టి ఐ , బయోడేటా, ఆధార్ కార్డ్, రెండు ఫోటోలు, ఇతర ధృవ పత్రాలతో) పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ. లో హాజరు కాగలరు. వివరాల కొరకు ఎన్. మల్లికార్జున స్వామి , ట్రైనింగ్ ఆఫీసర్ & అప్ప్రెంటీస్షిప్ అడ్వైసర్ మొబైల్ నెంబర్:9989616132 , జి. శ్రీనివాస్, ట్రైనింగ్ ఆఫీసర్, మొబైల్ నెంబర్:9703113881 ను సంప్రదించగలరు.