Listen to this article

జనం న్యూస్ 11 జనవరి కోటబొమ్మాళి మండలం: జిల్లాలోని ప్రతి రైతుల దగ్గర నుంచిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, మత్య్సకార, పశుసంవర్థకశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉన్న అధికారులతో చరవాణిలో మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అవసరమైన ట్రాక్‌ షీట్లు అందించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. రైతు ఇంట పండగ వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. రైతు ధాన్యం అమ్మిన నాలుగు గంటల్లోనే వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నా మన్నారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి. నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్దెత్తున వినతులు అందాయని ఉపాధి అవకాశాలు కల్సించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్‌, ఎల్‌.ఎల్‌.నాయుడు, బగాది శేషు, నాలుగు మండలలా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.