

జనం న్యూస్ 07 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గత కొద్ది రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం దశ దశలుగా పోరాటం నిర్వహిస్తున్న వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, వారి డిమాండ్ల సాధనకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి రాము , సిహెచ్ వెంకటేషులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యాల ఫలితంగా వెటర్నరీ విద్యార్థులు రోడ్డు పాలు అయ్యారని విమర్శించారు. అన్ని ఆరోగ్య సంబంధిత విద్యారంగాల్లో ఇంటర్న్ పీజీలు, పిహెచ్డి విద్యార్థులకు 25 వేల నుంచి 65 వేల వరకు స్టై ఫండ్ ఇస్తున్నారని కానీ వెటర్నరీ విద్యార్థులకు కేవలం 7000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. పశువుల రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పశువైద్య విద్యార్థులకు కూడా అధిక మొత్తంలో స్టైఫండ్ ఇచ్చి వారి విద్యకు తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఒక ఈ జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై పోరాటం జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన మేర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చేయని యెడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటం ఉదృతం చేస్తామని దీనికి రాష్ట్ర విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.