

అన్ని రంగాల్లో మగువలే.. సారథులు!! ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మహిళలకి ఓ ప్రత్యేక రోజును కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జనం న్యూస్ మార్చి 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8 న జరుపుతారు.ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు.ఓ వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి మొదలు, చెల్లి, భార్య, గురువు ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె అలవోకగా చేయగలదు. ఆమెలోని గొప్పదనం ఏంటంటే ఓ వైపు ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు సంఘంలోనూ ఎన్నో రోల్స్ పోషిస్తుంది. మగవారికి సమానంగా టీచర్, ఇంజనీర్, పైలెట్ వంటి బాధ్యతలను కూడా ఆమె స్వీకరించి వందశాతం వాటికి న్యాయం చేస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించిన విజయాలు నిజంగా ఆకాశాన్నంటాయి. వీటన్నింటికి ప్రతీకగా ప్రపంచంలోని మహిళల కోసం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ని ఏర్పాటు చేశారు.ముందుకాలంతో పోల్చితే రోజురోజుకి మహిళలు ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర కీలకం. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈ రోజున వారు సాధించిన విజయాలకి గుర్తుగా వారిని గౌరివించే రోజు.ఇక మహిళా దినోత్సవ చరిత్ర గురించి మాట్లాడితే.. నేడు అన్ని రంగాల్లోనూ ముందున్న మహిళలు.. తమ అద్భుత తెలివి, ఆలోచించే విధానంతో రోజురోజుకి పురోగతి సాధిస్తున్నారు.
