


ధన్గర్వాడీ పాఠశాల విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి పయనించే సూర్యడు // మార్చ్ // 7 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..కరీంనగర్ లో మంకమ్మతోటలోని (ధన్గర్వాడీ )ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి కోతి వస్తుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. ధన్గర్వాడీ పాఠశాల 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ పాఠశాలలో ఉండగా ఓ కోతి రావడంతో భయముతో , మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. విద్యార్థి కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అతడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఆసుపత్రికి వెళ్లి, రఘువర్ధన్‌ను పరామర్శించి, భయం వీడాలని, చదువులో దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. అలాగే, అతనికి అవసరమైన పుస్తకాలను అందించేందుకు హామీ ఇచ్చారు.అంతకుముందు, ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న క్రిటికల్ కేర్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించి, రోగుల కోసం అందించబోయే సదుపాయాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డికి పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్.ఎం.ఓ డాక్టర్ నవీనా తదితరులు పాల్గొన్నారు.
