

జనం న్యూస్ 08 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి నిధి కురిమెల్ల శంకర్ ) . ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల అందరిని కార్పొరేషన్ చేయడం వలన ప్రభుత్వానికి చాలా మేలు జరగడమే కాకుండా ప్రభుత్వం నేరుగా జీఎస్టీ కట్ట అవసరం లేదని ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకి ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీఎస్టీ ప్రభుత్వమే చెల్లిస్తుందని వేతనాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వారందరికీ ఉద్యోగ భద్రత దొరుకుతుందని ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సుమారు పది నెలల నుంచి ఔట్సోర్సింగ్ యాజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదని సరిగ్గా పీఎఫ్ లు ఈఎస్ఐలు కట్టడం లేదని హైదరాబాదులో కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతో విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కార్పొరేషన్ చేయాలి…