

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. ఈనెల 9న, ఖమ్మంలో జరిగే (రాయల. సుభాష్ చంద్రబోస్) రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి. మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్రనాయకులు పి.రామకృష్ణ పిలుపు. రవన్న వర్ధంతి సభ పోస్టర్లను సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో శుక్రవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఈనెల 9న, ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే (రాయల. సుభాష్ చంద్రబోస్) రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని, విప్లవ అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) రెండు తెలుగు రాష్ట్రాల విప్లవోద్యమ నాయకుడు అని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ ఎంఎల్ (ప్రజాపంథా) ఆ తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీకి దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు కేంద్ర కమిటీ నాయకునిగా ఉన్నాడు ఖమ్మం వరంగల్ పశ్చిమగోదావరి ఏజెన్సీ ఉద్యమానికి దశాబ్ద కాలం పునాదులు వేస్తూ తీవ్ర కృషి కొనసాగించారు ,ఆనాడు పార్టీ తనకు అప్పగించిన ఏజెన్సీ ప్రతిఘటన దళాల రక్షణకు, వాటిని నిలబెట్టుటకు శత్రువు దాడులను ఎదుర్కొని దళాలను ఉద్యమాన్ని నిలబెట్టడానికి తన జీవితాన్నంత రంగరించి కృషి చేశాడు అలానే మైదాన ప్రాంత ఉద్యమం అండదండలు లేకుండా ఏజెన్సీ ఉద్యమం నిలబడదని విశ్వసించి మైదాన ప్రాంత ఉద్యమ నిర్మాణానికి తీవ్ర కృషి చేశాడు అని అన్నారు.1969 లో డిగ్రీ ని వదిలివేసి కామ్రేడ్ బత్తుల. వెంకటేశ్వర్ రావు తో పని చేస్తూ, ఆ తరువాత 70 72 ప్రాంతంలో రహస్య జీవితంలోకి వెళ్ళాడు అన్నారు.50 సంవత్సరాల పాటు రహస్య జీవితం గడుపుతూనే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో 2016న మార్చి 9 బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అమరులు అయ్యారని అన్నారు. నిజామాబాద్ నుంచి తూర్పుగోదావరి దాకా ఏజెన్సీ, మైదాన ఉద్యమంలో ఆయన చేసిన కృషి, పట్టుదల, మెలకువగా ఉద్యమాన్ని నిలబెట్టడంలో ఓపికతో కూడిన కృషి ఎంతో విలువైనదనీ కొనియాడారు. ఈనెల 9న ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు రవన్న వర్ధంతి సభకు కదలి రావాలని విప్లవ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, పార్టీ డివిజన్,మండల నాయకులు జి. సాయిరెడ్డి, ఎం. లింబాద్రి, ఇ. రమేష్, బి. కిశోర్, కట్ట. రామన్న, ఎస్. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.