

ప్రభుత్వ పాఠశాలల లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య జనం న్యూస్ మార్చి 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపు మేరకు మునగాల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు షేక్ పాషా ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చే సమయాల్లో శాలువాలు పూల బొకేలు తీసుకొని రావద్దని వాటికి బదులు విద్యార్థులకి ఉపయోగపడే నోట్బుక్స్ ఇతర సామాగ్రిని విద్యార్థులకు అందించాలని కోరారని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని వారికి చదువు చెప్పిన గురువుల కి తల్లిదండ్రులకి పాఠశాల కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి పదవ తరగతి పరీక్షలు బాగా వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాలే సామెల్, రేణబోతు వీరారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తక్కెళ్ళపాటి సాయి, బోళ్ల రంగారెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు అంజిరెడ్డి, చేగొండి శ్రీనివాస్, బుల్లెద్దు వెంకన్న,రమేష్,వీరాచారి, బోనాల కోటేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
