Listen to this article

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోలేదు అట్లనే ఉన్నది.. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. కుంట కాదు.. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి , భూపతి రెడ్డి ల గురించి మాట్లాడే స్థాయి అరవింద్ ది కాదు.. నిజామాబాద్ రురల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహీందర్.మాట్లాడుతూ. జిల్లా ప్రజలకు అరవింద్ ఇప్పటికీ అందని ద్రాక్ష లాగానే ఉన్నాడని జిల్లాలోని రూరల్ ప్రాంతంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతివారికి ఎరికేనని. వారిని వీరిని తిట్టడం తప్ప అభివృద్ధి చేసి చూపించండి. మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అది కాంగ్రెస్ బిక్ష అని మరువకుండా ఉంటే చాలా మంచిది. సెంట్రల్లో గత పది సంవత్సరాల నుండి బిజెపి గవర్నమెంట్ ఉంది నిజామాబాదు.జిల్లాకు మీరు చేసిందో ఏమిటో చెప్పండి. జిల్లాలో ఇప్పుడు ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రి తెలంగాణ యూనివర్సిటీ ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవి కావా అవి మీకు కనబడుట లేవా. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎంపీ అరవింద్.ఇలాంటి వాక్యాలు చేస్తున్నాడు. ఎంపీ అరవింద్ సుదర్శన్ రెడ్డి , భూపతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను రురల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహీందర్ తీవ్రంగా ఖండించారు . అరవింద్ తన స్థాయి మరచి, మాట్లాడుతున్నాడని నిజామాబాద్ జిల్లా అభివ్రిద్ది చెందిందంటే కేవలం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్యే భూపతి రెడ్డి అని అన్నారు . రురల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉద్యమ నాయకుడని అయన ఉద్యమం చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేడని మహీందర్ అన్నారు .ఎంపీ అరవింద్ కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎంపీ అరవింద్ , బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ లు తమ సొంత రాజకీయ పబ్బం గడుపుకోడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఇలాంటివి మానుకొని కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించాలని తుంపల్లి మహీందర్ అన్నారు .తప్పుడు ప్రచారాలు చెయ్యడం బీజేపీ నాయకులకు కొత్తేమి కాదని అరవింద్ కు అబద్దాలు ఆడటం వెన్నెతో పెట్టిన విద్య లాంటిదని తుంపల్లి మహీందర్ తీవ్రంగా ఖండించారు.