Listen to this article

పయనించే సూర్యడు // మార్చ్ // 7 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎం ఎలక్ట్రికల్ బైక్ షోరూంను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం శుక్రవారం రోజున ప్రారంభించి షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షోరూమ్ యాజమాన్యం మరియు చల్లూరు గ్రామ ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండి రషీద్, సతీష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.