

గాలిపటాలు ఎగిరి వేయడానికి చైనా మాంజా వినియోగించరాదు.
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ జనవరి 13 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సంక్రాంతి సెలవుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జగ్రత్తగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునగాల మండల పరిధిలోని విద్యార్థులకు సంక్రాంతి సెలవుల సందర్బంగా ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. చెరువులు,నదుల వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కావున తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు.హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు తిరిగి హాస్టల్ కు వెళ్లేంత వరకు తల్లిదండ్రులే భాద్యత వహించాలని అన్నారు. సంక్రాంతి వచ్చిందంటే కుర్రకారు,పిల్లలు గాలి పటాలను పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం ఎగరవేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు ఇది గమనిస్తూ పిల్లలు గాలిపటాలు ఎగిరి వేసేటప్పుడు ఇండ్ల పైకి, గోడలు, నీటి ట్యాంకులు పైకి ఎక్కుతుంటారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటి పైకి ఎక్కకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు.చెడు వ్యాసనాలకు పిల్లలు బానిసకాకుండా చూడాలని అన్నారు.