

బిచ్కుంద జనవరి 11 :- జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో శనివారం రోజున జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం విజయవంతమైంది.జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 82 మంది తమ వంతు రక్త దాతలుగా నిలిచారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు అమ్మాజీ జడ్పిటిసి రాజు శ్రీహరి, డాక్టర్ కాళిదాస్ ,డాక్టర్ విక్రమ్, హనుమాన్లు సెట్, బసవరాజ్ పటేల్, ఉండే బసవరాజ్ నరేందర్ మహారాజు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు