


జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రతి సంవత్సరం ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి మరియు జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించడానికి మార్చి 7వ తేదీని ‘జన్ ఔషధి దివస్’గా జరుపుకుంటారు,మార్చి 1 నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు..ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు (పీఎంబీజేక్ ) అనే ప్రత్యేక అవుట్‌లెట్‌ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడం ముఖ్య లక్ష్యం.ఈ కార్యక్రమంలో భాగంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది జనరిక్ ఔషధాల మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా వైద్య సిబ్బంది ప్రజలకు ఈ క్రింది విషయాలపై అవగాహన చేశారు1.అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ ) నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. వాటిని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.2.అవగాహన పెంచడం జనరిక్ ఔషధాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అందుబాటు ధర నాణ్యతలో రాజీ పడదని నొక్కి చెప్పడం అధిక ధరలు మెరుగైన నాణ్యతను సూచిస్తాయనే అపోహను తొలగించడం జనరిక్ ఔషధాల ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాజేష్,ఆరోగ్య ఉప కేంద్రాల వైద్యులు డాక్టర్ మహోన్నత పటేల్,డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఫరహానుద్దీన్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్య,డాక్టర్ విజయ్ కుమార్,మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ అరుణ, రత్నకుమారి,సదానందం,దేవేందర్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు.