

బిచ్కుంద మార్చ్ 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు లోకమాత అహల్యబాయి జన్మదిన ఉత్సవాలను కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహిళా అధ్యాపకులకు కళాశాల బృందం శాలువాతో సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యతో అవకాశాలను అందిపుచ్చుకొని గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ 300 జన్మదిన ఉత్సవాలు కూడా నిర్వహించారు. ఆమె జీవిత విశేషాలను చిన్నతనం నుండి ఆమె ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని 30 సంవత్సరాల పాటు నిర్విరామంగా పాలించిన అహల్య బాయి జీవిత చరిత్రను కూడా విద్యార్థులను స్ఫూర్తివంతంగా తీసుకోవాలని వివరించారు..l ఈ కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ టి హనుమాన్లు, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ బాబు, మహిళా సాధికారత విభాగం రేవతి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.