

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలోఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఈరోజు చిలకలూరిపేట గ్రామీణ మండలంలో పోతవరము గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, అక్కడ పనిచేస్తున్న 20 మంది మహిళఉపాధ్యాయ లకు భారత మహిళా శిరోమణి అనే ప్రశంసా పత్రంతో షిరిడీ నుంచి తెచ్చిన సాయి వస్త్రములతో మహిళా ఉపాధ్యాయులను ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ సత్కరించారు, అనంతరం విద్యార్థులకు బియ్యం నూనె కందిపప్పు అందజేయడం జరిగింది, బాలాజీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తూ మగవాడికి దీటుగా సమాజంలో వివిధ పాత్రలు పోషిస్తూ కుటుంబాన్ని సమాజాన్ని చక్కదిద్దుతున్నారని, నేల నుంచి నింగిదాకా పయనిస్తున్నారని, ఆర్మీ నేవీ లాంటి రక్షణ రంగాల్లో ముందు భాగాల్లో ఉంటూ దేశానికి రక్షణ కవచం లాగా ఉంటున్నారని, ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక అత్తగా ఒక భార్యగా పరిపూర్ణమైన బాధ్యతను పోషిస్తూ ఒక మగవాడి వెనక ఒక శక్తిగా ఆదిశక్తిగా ఉంటూ ఈరోజు ప్రపంచానికి దిశా నిర్దేశంగా ఉన్నారని వారు వారు పూజనీయులు అభినందనీయులు అని తెలిపారు, విద్యాలయం ప్రిన్సిపల్ ఆస్ప్రిన్ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని తొమ్మిది నెలలు గర్భంలో మోసి జన్మనిస్తున్నామని అటువంటి మహిళలను అందరూ గౌరవంగా చూసి అభినందించాలని కోరారు, పలువురు మహిళ ఉపాధ్యాయ లు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాలయంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి విద్యార్థులు అందరూ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు మానేపల్లి సుధాకర్ విద్యార్థులు పాల్గొన్నారు