

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పాత కక్షలతో మండలం లోని గోవిందా పురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతనిప్పుల భద్రయ్య పై గొడ్డలితో హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ రంజిత్ రావు తెలిపారు సీఐ కథనం ప్రకారం మండలం లోని గోవిందా పురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతనిప్పుల భద్రయ్య పై పాత కక్షలతో అదే గ్రామానికి చెందిన ముప్పు శ్రీశైలం హత్యకు ప్రోత్సహించగా మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన బొత్త శ్రావణ్ కుమార్ బొత్త కుమారస్వామి మాజీ సర్పంచ్ పై గొడ్డలితో హత్యాయత్నం చేయగా నిందితులను బొత్త శ్రావణ్ కుమార్ ను ఏ 1 గా హత్య ను ప్రోత్సహించిన ముప్పు శ్రీశైలం ను అరెస్ట్ చేయగా ఏ 2 నిందితుడు బొత్త కుమారస్వామి పరారిలో ఉన్నట్లు సీఐ రంజిత్ రావు తెలిపారు ఈ హత్యాయత్నం కేసులో శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ కానిస్టేబుల్ సతీష్ శ్రీధర్ ఖలీద్ హోంగార్డ్ చందు చాకచక్యంగా 48 గంటలో నే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలియజేశారు….