

జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక బాబా మెట్ట లో గల కస్తూరిబాగ్ స్కూల్ నందు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ముఖ్యమైన మహిళ మణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.గాయత్రి సర్వ శిక్ష అభియాన్ మాట్లాడుతూ మహిళలు ప్రతిరోజు సవాళ్లను ఎదుర్కొని సమాజంలో ధైర్యసాహసాలను ప్రదర్శించి వారి విధి నిర్వహణలో ముందుకు దూసుకుపోతున్నారు అలాంటి వారిని గుర్తుంచుకోవడం శుభ సూచకమని తెలియజేశారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఐదుగురికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఏ.సుజాత, మరియు సన్మాన గ్రహితులు విజయ దుర్గ యూత్ సోసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక,స్పార్క్ సోసైటీ అధ్యక్షులు భవాని పద్మనాభం, న్యాయవాది బ్యూలారాణి,విజయనగరం యూత్ జాయింట్ సెక్రటరీ షేఖ్ ఝన్సీ , గౌతమి, శ్రావణి, హేమలత, తదితరులు పాల్గొన్నారు.