Listen to this article

జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌తో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. జిల్లాలో అభివృద్ది పనులను చేపట్టేందుకు ఎం.పి.లాడ్స్‌ నిధులు విడుదలపై చర్చించారు. ప్రతిపాదించిన పనులన్నింటినీ వెంటనే చేపట్టేందుకు వీలుగా అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా ఆదేశాలిస్తామని కలెక్టర్‌ చెప్పారు.