Listen to this article

జనం న్యూస్ 7మార్చి. కొమురం భీమ్ జిల్లా. ఆసిఫాబాద్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. కలం తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది. నేలను చదును చేసే నాగలి వంటిది.జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు. జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో ఒక వార్తను సేకరించడానికి విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు.రైతుది బ్రతుకు పోరాటం.జర్నలిస్ట్ ది మంచిని బ్రతికించాలనే ఆరాటం. జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో..,తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు.అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్టు. ఆ గడియారం ముల్లు ఒకటి నుండి పన్నెండుదాకా తిరిగితే,జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతూ 24 గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు. పేరుకు అతనిది పార్ట్ టైం డ్యూటీ అయినా,నిద్రపోనంత వరకు బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది. సేకరణ :- జనం న్యూస్ :
కంటె ఏలియా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్ .కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ )