Listen to this article

జనంన్యూస్. 08. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండల కేంద్రం లో మాదిగ ల దండోరా. షమిం అక్తర్. ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి. మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీ. అనే 4 గ్రూపులుగా చెయ్యాలి. సిరికొండ మండల కేంద్రంలో మాదిగల డప్పుల ప్రదర్శన..
సిరికొండ మండల అధ్యక్షులు మొట్టల దీపక్ అధ్యక్షతన జరిగింది. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. ఆదేశాల మేరకు ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో దప్పులతో ప్రదర్శన చెయ్యడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని కులాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్. గడువును నెల రోజులు పెంచడం జరిగింది. కానీ మాదిగలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ. ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. మాదిగ సమాజం కొంత మంది మాదిగ ద్రోహులను గమనించాల్సిన అవసరం ఉందని తెలియచేయడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేసే పనిలో ఉందని, జస్టిస్ షమిం అక్తర్. మాదిగ, మాదిగ ఉప కులాలకు ఇచ్చిన 9% న్యాయమే అని మాదిగలకు మోసం చేసే కుట్రకు తెరలేపిందని, దీని కోసం కొంత మంది మాదిగ ద్రోహులను చేరదీసి మాదిగల మహాత్ముడు అయిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. మీద అవక్కులు చెవాకులు పేలేలా ఒత్తిడి చేస్తుంది. దీనిని గమనించి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో రాజకీయ సమాధి కట్టాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెరా సంజీవ్, సిరికొండ మండలం కార్యదర్శి బోడ గణేష్, సిరికొండ.మాదిగలు పోత్నూర్. మాదిగలు, చిన్నవల్గోట్. మాదిగలు, న్యావనంది.మాదిగలు, పాల్గోనాడం జరిగింది సామాజిక ఉద్యమ నమస్కారలతో. మీ మొట్టల దీపక్ మాదిగ ఎమ్మార్పీఎస్ సిరికొండ మండల అధ్యక్షులు.