Listen to this article

జనం న్యూస్ మార్చి 8, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు,3 రోజులపాటు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 9వ తేదీన సుదర్శన హోమం, 10వ తేదీన చండీ హోమం, 11వ తేదీన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం, జరుగుతుంది అని ఆలయ నూతన కమిటీ చేర్మెన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు అన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.