

జనం న్యూస్ మార్చి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద డివిజన్ లో గల మాధవరం నగర్ కమ్యూనిటీ హాల్ లో నేడు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడి టీచర్స్ స్థానిక మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో ఆశ వర్కర్లకు పోస్టింగ్ ఇస్తూ వారి వేతవాలని పెంచారని అలాగే అంగన్వాడి టీచర్స్ మరియు ఆయాల వేతనాలు పెంచారని తెలియజేస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లకు నిశ్చిత వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వట్టి మాటలతో మోసం చేయడం మానుకొని మహిళా అభివృద్ధికి పాటుపడాలని మరియు వారు మహిళలను కోటీశ్వరులు చేస్తామని మరియు ప్రతి మహిళకు 2500 మహిళ విద్యార్థులకి స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీలను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.