

బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్..
జనం న్యూస్ //జనవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్..
బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..
భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నాం అన్నారు.
దాడి చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసారు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.రేవంత్ రెడ్డి దగ్గర హోం శాఖ ఉంది కదా అని కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలుగా తయారయ్యారన్నారు.సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అనేక సార్లు బూతులు మాట్లాడారు,లాగుల్లో తొండలు పంపిస్తాం అని,పేగులు మేడలో వేసుకుంటాం అని అంటే తప్పులేదు, కానీ రండలు అంటేనే ఆవేశం వచ్చిందా అనిమాట్లాడారు.కాంగ్రెస్ నేతలు నోరు విప్పితే, చాలు బూతులు,మాట్లాడుతున్నారన్నారు.పీసీసీ అధ్యక్షుడు,మహేష్ కుమార్ గౌడ్ తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలి అని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పు ఏంటి అని మాకు దాడులు, చేయడం చేతకాక కాదు అని మండి పడ్డారు.దొంగ దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదన్నారు.కేటీఆర్ పై దొంగ కేసుపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్,సినిమాకు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు,సినిమా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుని పర్మిషన్స్ ఇచ్చారన్నారు .సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలన్నారు.