Listen to this article

జనం న్యూస్, మార్చ్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ లకు వరాల జల్లు కురిపిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో లక్ష మందితో ప్రభుత్వం సభ నిర్వహిం చింది ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్‌ 2025ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చెయ్యడమే లక్ష్యంగా కోసం చాలా పథకాలు అమలు చేస్తోంది.కాగా ఇటీవలే ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలి పింది. సెర్ప్‌, మెప్మాలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్ల రుణం అందించడమే దీని ఉద్దేశం. ఇకపై.. ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ.. అభి వృద్ధికి మరింత దోహద పడతాయి. అలాగే మహిళల ఆధ్వర్యంలో 150 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందించనున్నారు.
తదుపరి దశలో మరో 450 బస్సులు చేర్చుతూ మొత్తం ఆరు వందల బస్సులు మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో నడపనున్నారు.