

జనంన్యూస్. 08. నిజామాబాదు. ప్రతినిధి. కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య పిలుపు సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని నునుగు మీసాల యుక్త వయసులో బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికాంబాన్ని ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ షహీద్ భగత్ సింగ్ అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో షహీద్ భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా క్రీడా పోటీలను పి వై ఎల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని యువత భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన చూపిన బాటలో నడవాలని ఆయన సూచించారు. రోజు రోజుకి మతం అనే మత్తు యువత బుర్రలోకి ఎక్కించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవారే పార్టీలంటూ పాబ్బాయిలంటూ వారి జీవితాలని చేజేతులారా పాడు చేసుకుంటున్నారని ఇంత జరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం మద్యం అమ్మకాలను మత్తు పదార్థాల అక్రమ రవాణాను నివారించడంలో విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. యువతే దేశానికి వెన్నుముక అని అనడమే తప్ప ఆ వెన్నుముక వీరుగుతుంటే కనీసం ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని ఆయన అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మద్యం అమ్మకాలని మత్తు పదార్థాల అక్రమ రవాణాను కట్టడి చేసి దేశాన్ని యువతని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు రావాలని, 22, 23 న జరిగే జిల్లాస్థాయి కబడ్డీ వాలీబాల్ చెస్ పాటల పోటీలను యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్. కార్యదర్శి పి ఎల్లయ్య. పి వై ఎల్ మండల అధ్యక్షులు మల్కి సంజీవ్. మంచేకంటి ప్రశాంత్. ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్. మోహన్. తదితరులు పాల్గొన్నారు.