

జనం న్యూస్ జనవరి 13 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్).
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం నాడు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పోచంపల్లి ఖండ సహా కార్యవాహ బిజెపి, బిజెపి నల్గొండ జిల్లా కౌన్సిలర్ నెంబర్ అంశల అనిల్ కుమార్,వెల్ది రాఘవరెడ్డి,సామ మహేందర్ రెడ్డి,బూత్ అధ్యక్షులు సుర్కంటి మధుసూదన్ రెడ్డి, వరికుప్పల వెంకటేష్, బొడ్డుపల్లి శ్రీకాంత్, సుర్కంటి కృష్ణారెడ్డి, ముత్యమాచారి, గోశిక నరేష్,శివ, వడ్డేపల్లి కిరణ్ కుమార్, పల్లె లింగుస్వామి,వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.