

జనం న్యూస్ 8 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా
ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం పాషా 19 సంవత్సరాల బాలుడు మలవిసర్జన చేయుటకు కాకతీయ కెనాల్ వద్దకు వెళ్లాడు కాలు జారడంతో కెనాల్ లో పడినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలు ద్వారా వీక్షించారు అనంతరం కుటుంబ సభ్యుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సిఐఎస్ఐ ఏఎస్ఐ తదితరులు తెలియజేశారు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించే విధంగా అధికారులు పోలీస్ శాఖ వారు చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు