

జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా శిశు సంరక్షణా కమిటీ చైర్మన్ హిమబిందు పాల్గొన్నారు. ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ముఖ్య అతిథి గా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏవో హేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లకి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన విజయనగరం ఎస్ కోట డిపో లకు చెందిన మహిళా ఉద్యోగినులను సన్మానించారు. ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్లు మహిళా ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.