

జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక కోట దగ్గర ఉన్న ఎస్.కన్వెన్సన్ ఫంక్షన్ హాల్ లో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 30 మంది మహిళలకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన సీనియర్ నాయకులు గురాన అయ్యలు రాధిక దంపతులు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళలు ఒకవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు విశిష్ట అతిథులుగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కరణం శివరామకృష్ణ మరియు హారతి సాహు దంపతులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, పి.రఘు, రాము,శివ వర్మ, ఎన్ రఘు ,విజయ్ కాంత్ , కళ్యాణ్, చంద్రిక, సాయి ప్రసాద్, వినయ్ , వికాస్, వెంకట పద్మనాభం,తదితరులు పాల్గొన్నారు*