Listen to this article

జనం న్యూస్ నారాయణఖేడ్
సంగారెడ్డి జిల్లా 12.01.2025
లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు టీ పి యు ఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యువజన సంఘాల నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు సంజీవరెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత కీర్తిని చాటిన వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయాడన్నారు. బలహీనులతో సమాజ నిర్మాణం సాధ్యం కాదని అందరూ మానసిక శారీకా ఆరోగ్యవంతులై దేశ నిర్మాణంలో ముందు ఉండాలన్నారు. నేటి సమాజంలో యువత సామాజిక సేవలో ముందుండాలన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులలో దేశభక్తి సమాజం పట్ల బాధ్యతను నేర్పాలన్నారు. అందుకోసమే తామందరం 2006లో లైన్స్ క్లబ్ ను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సన్మానించి 2005 సంవత్సరం నూతన డైరీ అందజేశారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో గణితంలో నైపుణ ప్రదర్శించి ఉత్తమ బహుమతిని సాధించిన వినయ్ కుమార్ ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో లైన్స్ బాధ్యులు చంద్ర శేఖర్ ఆచార్య రాజ్ కుమార్ జైపాల్ రెడ్డి,తపస్ బాధ్యులు రమేష్ చంద్రకాంత్ రాజయ్య జగదీష్ రతన్ సింగ్, సుదర్శన్,చంద్రశేఖర్, రామ కృష్ణ రెడ్డి, కిషన్, మచందర్, సతీష్, వివిధ యువ జన సంఘాల వాళ్ళు పాల్గొన్నారు