Listen to this article

జనం న్యూస్. మార్చ్ 8. సంగారెడ్డి జిల్లా. హత్నూర. పుస్తెలతాడు చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకొని గ్రామస్తులు దేహాశుద్ధి చేసిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది, హత్నూర ఎస్సై కె.సుభాష్ తెలిపిన కథనం ప్రకారం మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన చిప్పల్ తుర్తి సుగుణ రోజు మాదిరిగా సొలక్ పల్లి నుండి వడ్డేపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేండ్లగూడ మూల మలుపు వద్ద కల్లు దుకాణంలో కల్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుందని పోలీసులు తెలిపారు, ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కల్లు విక్రయిస్తున్న సుగుణను కల్లు కావాలని అడగగా ఆమె కల్లు ఇస్తున్న సమయంలో మాటల్లో పెట్టి ఆమె మెడలో నుండి పుస్తెలతాడును అపరించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఆ మహిళ అరుపులు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న వారు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని ఆవ్యక్తిని పట్టుకొని చితకబాదారు, ఈ క్రమంలో ఒక వ్యక్తి పట్టుబడ్డగా మరో వ్యక్తి బైక్ పై పరారైనట్టు పోలీసులు తెలిపారు , పట్టుబడ్డ వ్యక్తి సంగారెడ్డి ప్రాంతానికి చెందిన విజయ కళ్యాణ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు, బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు,