Listen to this article
  • త్వరలోనే ఇళ్ళందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు..
  • హుజురాబాద్ లోని దేవాలయాల సమస్యలపై వినతి పత్రం అందజేత..
  • రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు..

జనం న్యూస్ // మార్చ్ // 9 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయల అర్చకుల సమస్యలపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను శనివారం నాడు హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు కలిశారు.ఈ సందర్భంగా అపర భద్రాద్రిగా పేరొందిన ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన కమిటీ త్వరలోనే ఏర్పాటు చేసి,బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తామని మంత్రికి తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని,దాంట్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ దేవాలయాల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రణవ్ తెలిపారు.