Listen to this article

అనకాపల్లిలో కార్మికులతో భారీ ర్యాలీ జనం న్యూస్, మార్చి09,అచ్యుతాపురం: 54వ జాతీయ భద్రత వారోత్సవాలు సందర్భంగా అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక, ఫ్యాక్టరీస్ మరియు బాయిలర్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, మరియు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు,కంపెనీ యాజమాన్యం మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.