Listen to this article

జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్
భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తాపసి,తన సందేశాల ద్వారా భారత జాతిని జాగృతం చేసిన ఋషి..అణువణువున దేశభక్తిని,ధార్మిక శక్తిని చాటిన దేవర్షి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో మదవస్వామి ఆలయంలో మరియు ఎన్మన్ బెట్ల గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిఎల్లేని సుధాకర్ రావు వారికి ఘన నివాళులు అర్పించి.కొల్లాపూర్ యువతకి జాతీయ యువజన దినోత్సవం శభాకాంక్షలు తెలుపుతూ మన ప్రాంత అభివృద్ధి కోసం అనుక్షణం వెన్నంటు ఉంటున్న పార్టీకి నాయకునికి మద్దతుగా పోరాడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు మండల,పట్టణ అధ్యక్షులు,జిల్లా,మండల బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మదవస్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.